పసుపుబోర్డుపై బాండు పేపర్ రాసిచ్చి మరీ దగా చేసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాండు పేపర్ రాసిచ్చి మోసం చేసిన బోడగుండోడు ఏడ ఉన్నడంటూ పసుపు రైతులు వెతుకుతున్నరు. రైతులకు కనిపిస్తే తన గుండు పగులుతుందనే భయంతో భయపడిన అర్వింద్ ఢిల్లీకి పోయి దాక్కున్నడు. మళ్లీ ఇప్పట్లో నిజామాబాద్ వచ్చేలా లేడు. ఢిల్లీలో కూర్చుని చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని జిమ్ములు చేసుకుంట పసుపుబోర్డుపై తన బండారం బయటపెట్టిన టీఆర్ఎస్ ఎంపీ పెద్దాయన సురేష్ రెడ్డిపై చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటా టైమ్ పాస్ చేస్తుండు..అర్వింద్ తీరుపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. బోడగుండోడు నిజామాబాద్‌లో కనిపిస్తే పసుపురాసి ఊరేగించాలని సోషల్ మీడియాలో నెట్‌జన్లు చెడుగుడు ఆడేస్తున్నరు.
అంతేకాదు మరోవైపు వైయస్ షర్మిల కూడా అర్వింద్‌ను ఆడేసుకుంది. వచ్చే నెల కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్న షర్మిల ఆత్మీయ సమ్మేళనం పేరుతో రోజుకో జిల్లా నుంచి జనాలను లోటస్ పాండ్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఎంపీ అర్వింద్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో ఇచ్చారంట… బాండ్ పేపర్ ఇచ్చి రైతులను దగా చేశారట అంటూ అర్వింద్‌పై పరోక్షంగా మండిపడింది. తాటాకు బదులుగా ఈతాకు ఇచ్చినట్లుగా పసుపు బోర్డు పేరు చెప్పి స్పైసెస్ బోర్డుతో సరిపెట్టుకోవాలని చెబుతున్నారు.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా? అంటూ అర్వింద్‌ను నిలదీసింది.
స్పైస్ బోర్డు తీసుకువచ్చిన అంటూ అర్వింద్ చేస్తున్న ఎదురుదాడిపై కూడా షర్మిల స్పందించింది. పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతం, ఎక్స్ టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా? ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా? భైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఉండటం లేదా?’’ అని అర్వింద్‌పై విరుచుకుపడింది. భైంసాలో ఇటీవల జరిగిన మతఘర్షణలకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌లు కుట్రలు చేశారంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆరోపించారు.. మొత్తంగా పసుపుబోర్డు విషయంలో అర్వింద్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి పసుపుబోర్డుపై ఎవరు తనను ప్రశ్నించినా..అడ్డగోలు కామెంట్లతో విరుచుకుపడుతూ ఎదురుదాడి చేస్తున్న అర్వింద్ షర్మిల విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి.