28 నుంచి షర్మిల పాదయాత్ర..

44
sharmila
- Advertisement -

ఈ నెల 28 నుండి ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై అధ్యయనం కోసం ఈ నెల 11న పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన షర్మిల…తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో వైఎస్‌ షర్మిల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాదయాద్రను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా కులాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమని దీనిపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని తెలిపారు షర్మిల.

- Advertisement -