ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రశ్నించారు షర్మిల. మోడీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని ట్విటర్ వేదిక ద్వారా డిమాండ్ చేశారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని విమర్శించారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో చెప్పించాలని కోరారు.
తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు అని ఎద్దేవా చేశారు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన లేదని , 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని, కడప స్టీల్ కట్టలేదని ఆరోపించారు.
Also Read:20 లక్షల ఇళ్లకు సోలార్: చంద్రబాబు