- Advertisement -
ఏపీ లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వివేకా హత్య కేసులో జగన్ అసలు అంశాలను దాచిపెట్టి మాట్లాడటంలో దిట్ట…. లిక్కర్ స్కామ్ వెనుక కుట్రలు పూర్తిగా వెలికితీయాలి అన్నారు.
లిక్కర్ స్కామ్ చాలా పెద్దది…. కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే కాదు అన్నారు. బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపేశారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుకే అవినీతి దాగి ఉంది అని చెప్పారు.
జగన్ దీనిపై సమాధానం చెప్పాలి…. ఎక్కడా లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరం అన్నారు. పన్నులు ఎగ్గొట్టాలనే నగదుతో లిక్కర్ అమ్మకాలకు పాల్పడ్డారు… లిక్కర్ స్కామ్‌పై సమగ్ర విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు షర్మిల.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ షాక్
- Advertisement -

