వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రస్తుతం దిక్కు తోచని స్థితికికి వెళ్ళిపోయారు. అటు పార్టీని నిలబెట్టుకోలేక ఇటు వేరే పార్టీలో స్థానం దక్కక ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఆధారణ తక్కువగా ఉందని గ్రహించిన ఆమె కాంగ్రెస్ లో చేరాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు గత కొన్ని రోజులుగా. కానీ ఆమె ప్రయత్నాలన్నీ ఆశించిన స్థాయిలో ఫలించడం లేదు. షర్మిల కాంగ్రెస్ లో చేరదాన్ని మొదట స్వాగతించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విముఖత చూపిస్తున్నారట. ఆమె కాంగ్రెస్ లో చేరితే పార్టీలో విభేదాలు పెరిగే అవకాశం ఉందని అధిష్టానం కూడా షర్మిల విషయంలో పెద్దగా ఆలోచంచడం లేదని టాక్ వినిపిస్తోంది..
ఇప్పటికే పలు మార్లు కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయిన షర్మిల పార్టీ విలీనంతో త్వరలోనే ప్రకటన చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. కట్ చేస్తే అసలు షర్మిల అధిస్థానం పట్టించుకోవడం లేదట. షర్మిలా రాకను టి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కాదని ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తే రేవంత్ రెడ్డి అలకబూనే అవకాశం ఉంది. దానికి తోడు ఆమె డిమాండ్ చేస్తున్న పాలేరు సీటు ఇవ్వడానికి కూడా హస్తం పార్టీ సిద్దంగా లేదట. దీంతో మెల్లగా షర్మిల విషయంలో హస్తం పార్టీ డోర్స్ క్లోజ్ చేస్తునట్లు వినికిడి. మరోవైపు షర్మిల అస్థిర నిర్ణయాల కారణంగా వైఎస్ఆర్ పార్టీలోని నేతలు ఆ పార్టీని ఒక్కొక్కరుగా విడుతున్నారు. దీంతో పార్టీ ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా సొంత పార్టీ పరంగాను నిలవక, అటు పక్కా పార్టీలోనూ స్థానం లభించక షర్మిల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మరి ముందు రోజుల్లో వైఎస్ షర్మిల ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.
Also Read:ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్