షర్మిల.. బ్యాక్ టూ ఆంధ్రా?

34
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. అసలు పార్టీకి సంబంధించి అధినేత్రి వైఎస్ షర్మిలకె క్లారిటీ లేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే తాను తెలంగాణ బిడ్డనని రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకోస్తానని ఏవేవో వ్యాఖ్యలు చెప్పి.. తీర ఎన్నికల సమయానికి పార్టీని కాంగ్రెస్ లో కేలిపేందుకు సిద్దమయ్యారు. అదేదో ముందే కాంగ్రెస్ లో చెరివుంటే సరిపాయే.. ఆమాత్రం దానికి ప్రత్యేక పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం ఏంటి అని ప్రశించే వారికి షర్మిల కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. గత కొన్నాళ్లుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలిపేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.

కర్నాటక కాంగ్రెస్ బాస్ డికె శివకుమార్ ను మద్యవర్తిగా ఉంచి మరి కాంగ్రెస్ గడప తోక్కెందుకు తెగ ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఏమైందో తెలియదు గాని మొదట షర్మిల రాకను స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడేమే మొఖం చాటేస్తోంది. దాంతో ఇక చేసేదేమీ లేక బ్యాక్ టూ హోమ్ అంటోంది. అసలే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇంకా కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తే ఫలితం లేదనుకుందో ఏమో గాని ఇప్పుడు మళ్ళీ తన పార్టీని ఎన్నికల బరిలో నిలిపేందుకు తెగ ప్రయత్నిస్తోంది. దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులను తన పార్టీ తరుపున నిలబెట్టేందుకు షర్మిలా ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read:దేశమంతా తెలంగాణ వైపే!

ఆమె మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తూ, తన తల్లి విజయమ్మను పాలేరు బరిలో దింపాలని శర్మిల ప్లాన్ చేస్తున్నారట. నేడు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఆమె ఎన్నికల బరిలో నిలిచిన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనేది కొందరి అభిప్రాయం. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మినహా ఆమె పార్టీకి ఓటర్ల నుంచి మద్దతు లభించే అవకాశం లేదు. అందుకే ఆమె మొదట కాంగ్రెస్ విలీనం వైపు అడుగులు వేసి మళ్ళీ ఇప్పుడు రివర్స్ స్టెప్ వేసేందుకు సిద్దమౌతోంది. మొత్తానికి అర్థంకానీ రాజకీయ వ్యూహాలతో షర్మిల పార్టీ తెలంగాణలో ఎక్కువ రోజులు నిలవడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. మరి ఎన్నికల ఫలితాల్లో తేడా కొడితే ఆమె మళ్ళీ ఆంధ్రకు షిఫ్ట్ అవుతారా ? లేదా తన పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేసే చేతులు దులుపుకుంటారా అనేది చూడాలి.

Also Read:Telangana Congress:మనసు మార్చుకున్న జానారెడ్డి!

- Advertisement -