- Advertisement -
ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సాసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 30న విజయవాడలో మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ ముస్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు రానుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుకన్నదాని కంటే ఎక్కువ మంది వస్తే వారు నిరాశ చెందకుండా నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 40 నుంచి 50వేల మంది రానున్నట్లు తెలుస్తుంది.
- Advertisement -