- Advertisement -
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రేపటి నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలపారు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిలో జగన్ మోచేతికి గాయమైన విషయం తెలిసిందే.
దీంతో అతన్ని వైద్యులు కొన్ని రోజులు విరామం తీసుకొవాలని సూచించారు. దింతో ఆయన 17రోజుల పాటు విరామం తర్వాత మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ జగన్ 11జిల్లాల్లో పాదయాత్రను ముగించుకున్నారు. మొత్తం ఏడాది ముగిసేలోగా ఆయన 3,211.5కిలోమీటర్ల దూరం నడిచారు.
- Advertisement -