తప్పుడు కేసులకు భయపడం: జగన్

6
- Advertisement -

ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు అని తేల్చిచెప్పారు మాజీ సీఎం జగన్. ఏపీలో మీడియాతో మాట్లాడిన జగన్.. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు అన్నారు. మూడేళ్ల తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమేనని తేల్చిచెప్పారు.

చంద్రబాబుతో పాటు పావులుగా మారిన అధికారులు వడ్డీతో సహా చెల్లిస్తారని వార్నింగ్ ఇస్తున్నా అన్నారు. సినిమా డైలాగులు పోస్టర్ల మీద వాడినందుకు ఇద్దరిని రిమాండ్‌కి పంపించారు… డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? చెప్పాలన్నారు.

నచ్చిన పాట పాడినా, నచ్చిన డైలాగులు పెట్టుకున్నా తప్పే అంటే ఎలా?.. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు. దాన వీర శూర కర్ణ కన్నా చంద్రబాబు గొప్పగా యాక్టింగ్ చేస్తున్నాడు… చంద్రబాబు లైవ్ యాక్షన్ ముందు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిపోయాడు అని ఎద్దేవా చేశారు.

Also Read:వీధి కుక్కలపై ప్రేముంటే..ఇంటికే తీసుకెళ్లండి!

- Advertisement -