ఏపీలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అధికారంలో ఉన్న ‘వెన్నుపోటు పార్టీ’ ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో రైతులను దారుణంగా మోసం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరువు తీవ్రతను గుర్తించకుండా ‘కుంభకర్ణుడి నిద్ర’ నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం సాగునీరు అందిస్తుందని నమ్మి రైతులు అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లు నాటారని, కానీ సరిపడా నీరు అందక ఆ పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందనే విషయాన్ని చెప్పడానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదని, రైతులను ఆదుకోవాలనే కనీస శ్రద్ధ ఆయనకు లేదని విమర్శించారు.
ప్రభుత్వంలోని మంత్రులు కేవలం పబ్లిసిటీ స్టంట్లు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారని, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న బాధలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణమే సాయం అందించి, పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Also Read:తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు

