ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబుకు అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్ డైలాగులు చెప్తున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి? చెప్పాలని రోగులు పడుతున్న ఇబ్బందులను షేర్ చేశారు.
.@ncbn గారూ…, అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని… pic.twitter.com/u0761DrSW5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025
Also Read:SSMB29:రాజమౌళి మూవీ..బిగ్ అప్‌డేట్

