ఏపీ స్పీకర్‌పై జగన్ సెటైర్లు

11
- Advertisement -

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. ప‌ర‌వాడ‌లో న‌కిలీ మ‌ద్యం చేస్తోంది అయ్య‌న్నపాత్రుడు స‌న్నిహితుడు రుత్త‌ల రాము అన్నారు. చూడు ఎంత చక్కగా నవ్వుతున్నారో.. స్మార్ట్‌గా ఉన్నారు ఇద్దరూ అంటూ ఎద్దేవా చేశారు.

ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌ చేయడం చంద్రబాబు, లోకేశ్‌ కు మాత్రమే సాధ్యం అని ఆరోపించారు జగన్. విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా బయటపడింది అన్నారు.

పరవాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు బయటపడ్డాయి… పరవాడలో అయ్యన్నపాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడు అన్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఆరోపించారు.

Also Read:TTD:ఆర్జిత సేవా టికెట్లు విడుదల

- Advertisement -