ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఎంత పట్టుదలగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేవలం విజయం మాత్రమే కాకుండా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో టార్గెట్ దిశగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా పోలిటికల్ సర్కిల్స్ హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. నిత్యం ఏదో ఒక రీతిలో పార్టీ పేరు తన పేరు ప్రజల్లో వినపడేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇక అధికారంలోకి వచ్చినది మొదలుకొని ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాలకు, చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన పేరు ఉండేలా చూసుకుంటున్నారు..
ఇక సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వైసీపీ పార్టీ రంగులు కనిపించేలా చూసుకుంటున్నారు. దీంతో జగన్ అనుసరిస్తున్న తీరుపై మొదటినుంచి కూడా విమర్శలు గట్టిగానే వినిపించాయి. అయినప్పటికి ఆ విమర్శలను జగన్ పట్టించుకున్న దాఖలలే కనిపించలేదు. ఇక తాజాగా ఏపీలో చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంతో ఈ జగన్ కు ఉండే ఈ పబ్లిసిటీ పిచ్చి పీచ్ కు వెళ్ళినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్న మాట.
ప్రతి ఇంటికి జగన్ ఫోటో ఉండే స్థిక్కర్ల ను అంటించి కుటుంబంలోని ప్రతిఒక్కరు జగన్ గురించి జగన్ అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడుకునేలా ” జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే తన స్వలాభం కోసం ప్రజా ధనాన్ని ఈ స్థాయిలో వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది. నిజంగా జగన్ పాలన బాగుందని ప్రజలు భావిస్తే.. ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలే జగన్ పాలనను పబ్లిసిటీ చేస్తారని రాజకీయవాదులు చెబుతున్నా మాట. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఎలాంటి విజయాన్ని కట్టబెడటారో చూడాలి.
ఇవి కూడా చదవండి..