గిట్టుబాటు ధర లేక అవస్థలు:జగన్

4
- Advertisement -

గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్న ఉల్లి రైతుల‌ను ప‌రామ‌ర్శించారు మాజీ సీఎం జగన్. పులివెందుల వేంపల్లి మండలం తాళ్ళపల్లిలో ఉల్లి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు.

వైసీపీ హ‌యాంలో మినిమం రూ.4000 నుంచి రూ.12,000‌కు అమ్ముడుపోయిన క్వింటాల్ ఉల్లి.. నేడు రూ.2500కు ప‌త‌న‌మైంద‌ని వైఎస్ జ‌గ‌న్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో రైతులను పరామర్శించారు జగన్. కూటమి పాలనలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి రైతుకు ఇచ్చేది రూ.6.. హెరిటేజ్ లో అమ్మేది రూ.35 అని మండిపడ్డారు జగన్.

చంద్రబాబే బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించి కమిషన్లు తీసుకుంటున్నారు…గిట్టుబాటు ధరకు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వమే ఉల్లి కొనుగోలు చేయాలి అన్నారు.

Also Read:వరంగల్‌లో కీటెక్స్ ఉత్పత్తి ప్రారంభం..కేటీఆర్ హర్షం

- Advertisement -