జగన్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్!

45
- Advertisement -

ఏపీలో ఎన్నికల విషయంలో గత కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుంటే.. మరికొన్ని సంధార్భాల్లో లేదులేదు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అనే వాదన వినిపిస్తోంది. ఇంకో సందర్భంలో అసలు ఏపీ ఎన్నికల అంశం కేంద్రం చేతిలో ఉందని కేంద్రం ఎప్పుడు ఒకే అంటే అప్పుడే ఎన్నికలు జరుగుతాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ రకమైన వార్తలు రావడానికి కారణం అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే. గతంలో ఎన్నికలు ఎప్పుడైనా రావోచ్చని నేతలంగా అలెర్ట్ గా ఉండాలని అధినేత వైఎస్ జగన్ తరచూ హెచ్చరిస్తూ వచ్చారు. .

అలాగని ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు అబ్బే అలాంటిదేమీ లేదని దాటవేస్తున్నారు. ఇక ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన ఓ మంత్రి ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు కన్ఫర్మ్ అని వ్యాఖ్యానించారు. దీంతో స్వయం మంత్రే ఆ రకమైన వార్తలు రావడంతో ఏపీ లో ముందస్తు ఎన్నికలు గ్యారెంటీ అంచనాకు వచ్చారు ప్రజలు. మళ్ళీ ఇంతలోనే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు.

దీంతో అసలు ఎన్నికల విషయంలో జగన్ ఇందుకింతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉన్నప్పుడూ ఎలక్షన్స్ విషయంలో ఎందుకింత గందరగోళం సృష్టిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ప్రస్తుతం టీడీపీ తీవ్రంగా డీలా పడడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ మొదట భావించినప్పటికి.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళేందుకు జగన్ సిద్దమయ్యారనేది కొందరు చెబుతున్నా మాట. మొత్తానికి ఎన్నికల విషయంలో జగన్ తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:విచారణకు రెడీ.. తాడో పేడో?

- Advertisement -