- Advertisement -
కరోనా వైరస్ ను యువత ఈజీగా తీసుకుంటున్నారన్నారు యశోద ఆసుపత్రి వైద్యుడు ఎంవీ రావు. కరోనా మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రబలితే తీవ్ర పరిణామాలు ఉండేవి అన్నారు. ఎంతో కసరత్తు చేసి లాక్ డౌన్ ను విధించారన్నారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించడం లేదన్నారు.
లాక్ డౌన్ ని కొంతమంది యువకులు అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీలు చేసుకోవడం, గెట్ టుగేదర్ అవడం, ఆటలాడటం చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి లేదంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. చప్పట్లు, గంటలు కొట్టిన జనాలే నేడు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు. బయటకు రాకుండా ఉండటమే వైద్యులకు, ప్రభుత్వానికి మీరిచ్చే కానుక అన్నారు.
- Advertisement -