యూత్ కాంగ్రెస్ నేతలు..పోలీస్ కస్టడీకి!

2
- Advertisement -

న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా యువ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన కేసులో ఐదో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువ కాంగ్రెస్‌కు చెందిన జితేంద్ర యాదవ్‌ను గ్వాలియర్‌లో అదుపులోకి తీసుకుని, రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

ఇప్పటికే ఈ కేసులో కృష్ణ హరి, కుందన్ యాదవ్, అజయ్ కుమార్, నరసింహ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పటియాల హౌస్ కోర్టు వీరందరికీ బెయిల్ నిరాకరించి, ఐదు రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ చేసింది.

శుక్రవారం న్యూఢిల్లీలోని Bharat Mandapam వేదికగా జరిగిన సమ్మిట్‌లో యువ కాంగ్రెస్ కార్యకర్తలు హై-ప్రొఫైల్ నిరసన చేపట్టారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలో అంతరాయం కలిగించారు. ఐదు రోజులపాటు సాగిన ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో ప్రపంచ నాయకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. చివరి రోజున జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.

ఈ నిరసనపై ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌ను అడ్డుకోవడం, సమ్మిట్‌లో నిబంధనలు ఉల్లంఘించడం కాంగ్రెస్ వైఖరిని చూపుతోందని అన్నారు.

Also Read:ఎక్స్ ట్రార్డినరీగా ‘సరస్వతి’!

- Advertisement -