విజయ్ దేవరకొండ దర్శకుడితో మహేశ్ బాబు27 మూవీ

156
Mahesh babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి మూవీ సక్సెస్ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా…అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈమూవీని దిల్ రాజు, పీవీపీ, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మించారు. మహర్షి మూవీ మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవాలి.

మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీ సక్సెన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మహేశ్ తర్వాతి సినిమా ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండనుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే పూజా కార్యక్రమాలు జరిపి రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈసినిమా తర్వాత మహేశ్ తన తర్వాతి మూవీని కూడా లైన్ పెట్టినట్లు తెలుస్తుంది.

గీత గోవిందం సినిమాతో మంచి హిట్ అందుకున్న ద ర్శకుడు పరశురామ్ ఇటివలే మహేశ్ బాబుకు లైన్ వినిపించాడట. ఆయన చెప్పిన లైన్ నచ్చడంతో స్టోరీ డెవలప్ చేసుకుని తీసుకుని రమ్మన్నాడని సమచారం. ఈసినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది. పరశురామ్ చెప్పిన కథ మహేశ్ కు నచ్చుతుందో లేదో చూడాలి.