వింటేజ్ కార్ల వ్యాపారిగా ప్రభాస్..

443
prabhas rebal
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. ఈమూవీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా యూవీ క్రియేష‌న్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ ఈసినిమా చేస్తుండ‌టంతో ఈమూవీపై భారీ అశ‌లు పెట్ట‌కున్నారు. అంతేకాకుండా ఈసినిమాను హిందీలో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. వ‌చ్చే స‌మ్మ‌ర్ లో ఈచిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

prabhas

ఇక ప్ర‌భాస్ త‌ర్వాతి సినిమా జిల్ మూవీ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌తో చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈసినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను చిత్రీకరించనున్నారు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌ర‌గుతోంది. సినిమాలో పాత్ర ప్రకారం ప్రభాస్ యూరోప్ లో వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట.ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు.

- Advertisement -