ఇంటిగ్రేటెడ్ స్కూల్స్..గేమ్ ఛేంజర్!

13
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించబడుతుంది అన్నారు భట్టి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది అన్నారు.

ఒక్కో రెసిడెన్షియల్ స్కూల్‌ను అన్ని ఆధునిక సౌకర్యాలతో కలిపి, సుమారు రూ. 200 కోట్లతో నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణలోని విద్యార్థులకు మెరుగైన విద్య, అన్ని వసతులతో కూడిన వాతావరణాన్ని కల్పించడమే ఈ భారీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read:OTT:ఈ వీకెండ్ ఓటీటీ సినిమాలివే

- Advertisement -