కాంగ్రెస్ భూకుంభకోణంపై హరీష్ ఫైర్

7
- Advertisement -

కాంగ్రెస్ భూ కుంభకోణంపై ప్రభుత్వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 8 సూటి ప్రశ్నలు
1. సబ్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ, టీజీఐఐసీ వ్యాల్యూ అని రెండు ఉంటాయి. సాధారణంగా టీజీఐఐసీ రేటు ఎక్కువగా ఉంటది. రెండు, మూడు రెట్లు ఉంటుంది. ప్రభుత్వానికి లాభం చేకూరాలని మేం టీజీఐఐసీ రేటుకు భూములు ఇచ్చినం. రేవంతు రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎస్ ఆర్ వో వ్యాల్యూలో కేవలం 30శాతం రేటు చెల్లించి భూములు కట్టబెడుతున్నది. టీజీఐఐసీ రేటు కాదని, ఎస్ ఆర్ వో రేటును ఎందుకు పరిగణలోకి తీసుకున్నరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
2. హైదరాబాద్ లో SRO ధరలు తక్కువగా ఉన్నయి, త్వరలో పెంచుతామని ప్రకటనలు చేసిన రేవంత్ ప్రభుత్వం. ఇప్పటి వరకు పెంచింది లేదు. ముందుగా ఓఆర్ఆర్ లోపల, ఆ తర్వాత బయట పెంచుతాం అన్నరు. అది అమలులోకి రాక ముందే ఈ పాలసీని ఎవరి మేలు కోసం తెచ్చారు? ఎందుకోసం హడావుడిగా అమలు చేస్తున్నారు? పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, పేదలకు ఒక విధానం. సవరించిన భూముల రేట్లు కేవలం పేదలకేనా? ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములు కట్టబెట్టడాన్ని ధరలు సవరించే వరకు ఎందుకు ఆగటం లేదు?
3. ఉదాహరణకు వంద రూపాయలు గజం ఉంటే, బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందలు తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు 30రూపాయలకు తగ్గించింది? లక్షల కోట్లు రాకుండా రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్నది వాస్తవం కాదా?
4. నాడు నో LRS, నో బీఆర్ఎస్ అన్నడు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక ఒక పేదవాడు కొద్ది గజాల్లో భూమి కొని, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి సైతం ఎల్ ఆర్ ఎస్ వసూలు చేసాడు? ఒక పేదవాడు కొన్న భూమికి అయితే ఎస్ ఆర్ వో పై 60, 80శాతం ఎల్ ఆర్ ఎస్ వసూలు చేసారు, కానీ ఇప్పుడు కేవలం 30శాతానికే మల్టిపుల్ జోన్ గా కన్వెర్ట్ చేస్తున్నారు. పేదవాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం ఉంటదా? ఈ పాలసీ ఎవరికోసం ప్రభుత్వం సమాధానం చెప్పాలి?
5. దసరాకు, దీపావాళికి ఆఫర్లు చూస్తుంటాం. కానీ ఈ పాలసీలో రేవంత్ రెడ్డి బొనాంజా పెట్టిండు. 30శాతానికి ల్యాండ్ కన్వర్ట్ చేయడమే కాదు, ఈ 30శాతంలోనే ఆల్ ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉన్నయి. రెవెన్యూ, హెచ్ఎండీఏ కి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, నాలా కన్వర్షన్.. ఇట్ల దేనికి దరఖాస్తు చేయడం అవసరం లేదు. కన్వర్షన్ రూపంలో హెచ్ ఎం డీఏకు వచ్చే 13,500 కోట్ల రూపాయలు రాకుండా చేసిండు రేవంత్ రెడ్డి.
6. ఓఆర్ఆర్ లోపల మాత్రమే కాదు, ఓఆర్ఆర్ చుట్టు పక్కల భూములు కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో ఉంది. ఇది నిజమా కాదా సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి, అనుముల బ్రదర్స్ జేబులు నింపే పాలసీనా కాదా సమాధానం చెప్పాలి?
7. ఆరు నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసారు. విలువైన భూములను, సగానికి సగం అనుముల బ్రదర్స్ చేతుల్లోకి పోయింది. అగ్రిమెంట్లు చేసుకున్నరు. కమీషన్లు, వాటాలు కూడా మాట్లాడుకున్నరు. ప్రీప్లాన్డ్ స్కాం ఇది. ఇది నిజామా కాదా సమాధానం చెప్పాలి? త్వరలో ఆ భూములు, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసారు కూడా బయటపెడుతాం? ఇది ముమ్మాటికి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ కాదు, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్ఫర్మేషన్ పాలసీ. వీటన్నిటికి ఆర్ ఆర్ టాక్స్ అదనం.
8. వచ్చే 30శాతం డబ్బును అయినా కొత్త పరిశ్రమలకు వాడుతరా, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ది చేయడం కోసం వాడుతరా? లేదా బడా బడా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని వారి బిల్లులు చెల్లించేందుకు వాడుతారా? ఎందుకుంటే ఇది టీజీఐఐసీ డబ్బు. సమాధానం చెప్పాలి.
ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా దగ్గర సమాధానం ఉందా?

- Advertisement -