ఎన్టీఆర్ ను వాడేస్తున్న కుర్ర హీరో

71
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ వీరాభిమాని అనే సంగ‌తి తెలిసిందే. అందుకే, త‌న సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన క్లిప్స్, లేదా ఎన్టీఆర్ పై పాజిటివ్ కామెంట్స్ క‌నిపిస్తూనే ఉంటాయి. ఐతే, ఇప్పుడు విశ్వక్ సేన్ మరో మెట్టు ఎక్కబోతున్నాడు. తన సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ను కూడా వాడేయాలని ఫిక్స్ అయిపోయాడు. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విశ్వక్ సేన్ క్యారెక్ట‌ర్ విభిన్నంగా ఉండ‌బోతోంది. తాను ఓ యువ రాజకీయ నాయకుడిగా క‌నిపించ‌బోతున్నాడు.

ఐతే, ఈ సినిమాలో ఓ ఆసక్తికర సంద‌ర్భం ఉందట. సినిమాలో.. కుర్ర రాజకీయ నాయకుడిగా విశ్వక్ సేన్ ఓ భారీ డైలాగ్ చెప్పబోతున్నాడు. సినిమాలో జూ. ఎన్టీఆర్ ఫ్యాన్ గా కనిపించబోతున్న విశ్వక్ సేన్, యమదొంగ సినిమాలోని డైలాగ్ ను పదేపదే చెప్పి.. ఎన్టీఆర్ ప్రేరణతో సినిమాలో తాను కూడా అంతే బాగా చెప్పి.. పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాడట. ఇది సీన్. మొత్తానికి విశ్వక్ సేన్, తన కొత్త సినిమాలో ఎన్టీఆర్ ను వాడేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి తెర‌పై ఎన్టీఆర్ క‌నిపిస్తాడో లేదో కానీ, ఎన్టీఆర్ ప్ర‌స్తావన‌ మాత్రం త‌ప్ప‌కుండా ఈ సీన్ లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read: Bollywood:ప్రశ్నిస్తే..టార్గెట్ చేస్తున్నారు..!

అయితే, రాజకీయ పరమైన వార్తలు తన చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్, విశ్వక్ సేన్ కి తన పేరును సినిమాలో వాడుకొవడానికి ఛాన్స్ ఇస్తాడా ?, చూడాలి. ఇదేమంత క‌ష్టం కాదు. ఎందుకంటే.. ఎన్టీఆర్ అంటే విశ్వక్ సేన్ కి ఎంతిష్ట‌మో.. విశ్వక్ సేన్ అన్నా ఎన్టీఆర్ కి అంతే అభిమానం. విశ్వక్ సేన్ అడిగితే.. ఎన్టీఆర్ కాద‌న‌డు.

Also Read: సమంత పై స్పందించు చైతు

- Advertisement -