టాలీవుడ్‌కి ఈ రోజుల్లో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మారుతి ఆతర్వాత బస్స్టాంప్, ప్రేమకథా చిత్రం,రొమాన్స్ ఇలాంటి సినిమాలతో హిట్ అందుకున్న మారుతి గత సంవత్సరం భలేభలే మగాడివో చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆకట్టుకున్నడు మారుతి. ఈ సినిమాతో తన మార్కెట్‌ను సైతం బాగా పెంచుకున్నాడు. ఇప్పటి వరకు టాప్ హీరోలతో తీయని మారుతి ఈ ఏడాది విక్టరీ వెంకటేష్‌కి బాబు బంగారం లాంటి మంచి కామెడీ చిత్రాన్ని అందించాడు. ఇప్పుటి వరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని మారుతి తాజాగా ఓ యంగ్ హీరోతో గొడవ పడ్డట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వస్తే రామ్‌లీలా, జీనియస్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హవీష్. ఈ సినిమాలో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు . డబ్బు బాగానే ఉంది కానీ సక్సెస్ లేకపోవడంతో మారుతి తో సినిమా చేద్దామని ఆశించాడు. అయితే సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకొన్న మారుతి. ఇప్పుడు ఆ సినిమా చేయకపోవడంతో ఆ యంగ్‌హీరో గొడవకు దిగాడట దాంతో వారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీని వెనకు అసలు కారణం అగ్రహీరోలతో సినిమాలు చేయాలనీ ఫిక్స్ అవడంతో ఇతని తో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదట మారుతి. ఈనేపథ్యంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసినట్లు సమాచారం. ఈవిషయం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో రకరకలుగా చక్కర్లు కొడుతుందట.