నితిన్ కు జోడిగా ర‌కుల్ ..

358
nithin rkul preet singh
- Advertisement -

కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు యంగ్ హీరో నితిన్. అందుకే కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మంచి క‌థ కోసం వెయిట్ చేశాడు. తాజాగా ఛ‌లో మూవీ ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల చెప్పిన క‌థ‌ను ఓకే చేశాడు నితిన్ . ఈమూవీకి భీష్మా అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు.

nithin venky kudumula

ఈచిత్రంలో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మీక మంద‌న న‌టించ‌నుంది. జ‌న‌వ‌రి నుంచి ఈమూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. తాజాగా ఉన్న స‌మాచారం ప్రకారం నితిన్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. ఈమూవీలో హీరోయిన్ కోసం ర‌కుల్ ను సంప్ర‌దించ‌గా ఆమె ఓకే చెప్పేసింద‌ని తెలుస్తుంది.

nithin Rashmika
గ‌త కొద్ది రోజులుగా ర‌కుల్ తెలుగు సినిమాల్లో న‌టించ‌డంలేదు. కొత్త హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల ఈసంవ‌త్స‌రం ర‌కుల్ కు ఎక్కువ ఛాన్స్ లు రాలేదు. నితిన్ న‌టించే ఈరెండు సినిమాల‌ను ఒకే సారి సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -