ఒకప్పటికీ ఇప్పటికీ సినిమా ఈవెంట్స్ లో చాలా మార్పు వచ్చింది. అందులో మెయిన్ చేంజ్ బౌన్సర్లు. అవును ఒకప్పుడు హీరోలు డైరెక్ట్ గా ఈవెంట్స్ కి వచ్చేసే వారు. వారి చుట్టూ బౌన్సర్లు ఉండేవారు కాదు. మరీ పబ్లిక్ ఈవెంట్ అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు కుర్ర హీరోలకి ఈవెంట్ కి వచ్చే ముందు నుంచే నలుగురు బౌన్సర్లు కావల్సి వస్తుంది. ఇందులో తప్పేమీ లేదు. ఇప్పుడున్న సెల్ఫీ రచ్చ కి జనాలని కంట్రోల్ చేస్తూ హీరోలను ఈవెంట్ లోకి తీసుకెళ్లేందుకు బౌన్సర్లు అవసరమే కానీ బౌన్సర్లు ఎక్కువ జనాలు తక్కువ ఉంటేనే కామెడీ గా ఉంటుందిగా.
తాజాగా ఓ కుర్ర హీరోకి బౌన్సర్ల పిచ్చి పట్టుకుంది. కాలు కదిపితే పది మంది, ఈవెంట్ కి ఎటెండ్ అయితే 20నుండి 30 మంది బౌన్సర్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట. ఈవెంట్ మేనేజర్ కి ముందే తన టీమ్ తో ఆ విషయం చెప్పించి బౌన్సర్ల కౌంట్ పెంచుకుంటున్నాడట. ఇంతా చేసి యంగ్ హీరోకి మీద పడిపోయే క్రేజ్ ఉందా ? లేనేలేదు. ఇదంతా తను ఇది, తన క్రేజ్ ఇది.. అని చూపించుకునే ప్రయత్నం అంతే. ఈ కుర్ర హీరోకి పట్టు మని అరడజను హిట్లు కూడా లేవు. మరి ఎందుకు ఇంత అతి ? అంటూ ఈవెంట్ కి వచ్చిన మీడియా , అలాగే ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
తాజాగా ఈ కుర్ర హీరో సినిమాకు సంబందించి ఓ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి వచ్చే ముందు ఓ పది హేను మంది, వెళ్ళే టప్పుడు ఇరవై మంది బౌన్సర్లను పెట్టుకున్నాడు. నిజానికి పబ్లిక్ ఈవెంట్స్ కి బౌన్సర్లు అవసరమే కానీ మరీ ఇంతమంది ఎందుకో ? ఈవెంట్ లో తన ఫ్యాన్స్ తో సమానంగా బౌన్సర్లు అవసరమా? ఆ కుర్ర హీరోకి తెలియాలి.
ఇవి కూడా చదవండి…