ఈ జ్వరాలతో.. జాగ్రత్త !

40
- Advertisement -

వర్షాకాలం రాగానే ఎన్నో రోగాలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాన్ సూన్ లో వచ్చే వ్యాధులతో పోల్చితే ఇతర సీజన్ లలో వచ్చే వ్యాధులు చాలా తక్కువ. వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉద్భవించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కండ్లకలక వ్యాధి ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఇంకా వివిధ రకాల వైరస్ ల కారణంగా ఈ వర్షాకాలంలో పలు రకాల వ్యాధుల ముప్పు పొంచి ఉంది. మరి అవేంటో తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటిద్దాం.

మలేరియా
వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులలో మలేరియా జ్వరం కూడా ఒకటి. వర్షాకాలంలో దోమల వృద్ది ఎక్కువగా ఉండడం వల్ల మలేరియా వ్యాప్తి జరుగుతుంది. ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు మలేరియా జ్వరానికి దారి తీస్తుంది.మలేరియా కారణంగా అధిక జ్వరం, గొంతులో మంట, విరోచనలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపితాయి. మలేరియా కు సరైన వైద్యం తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మలేరియా బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుబ్రత చాలా ముఖ్యం.

Also Read:మోడీ.. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారా?

చికెన్ గున్యా
టైగర్ ఏడేస్ అల్బో ఫిక్టస్ దోమ కాటు వల్ల చికెన్ గున్యా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చికెన్ గున్యా వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నీరసం, తలనొప్పి కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యుడిని సంప్రధించడం చాలా ఉత్తమం.

డెంగ్యూ
ఈ వ్యాధి కూడా దోమల కారణంగానే వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ బారిన పడిన వారిలో విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో పాటు వికారం, వాంతులు, లో బీపీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వ్యాధికి సరైన చికిత్స తీసుకోక పోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

టైఫాయిడ్
టాఫాయిడ్ బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి. మనం తినే ఆహార పదార్థాలపై సల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉన్నప్పుడూ టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన జ్వరంతో పాటు విరోచనాలు, కడుపు నొప్పి, నీరసం, అలసట, వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ వ్యాధులన్నీ కూడా దోమలు, వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి కారణంగా ఏర్పడతాయి. వీటి ప్రభావం వర్షాకాలంలో చాలా ఎక్కువ కాబట్టి ఆరోగ్య పరంగా ఈ సీజన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

Also Read:‘భోళా శంకర్’తో చిరుకు డిజాస్టర్ తప్పదా?

- Advertisement -