2025 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. నయా భారత్ థీమ్‌తో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నయా భారత్ థీమ్ 2047 నాటికి “వికసిత భారత్” లక్ష్యాన్ని సాధించాలనే టార్గెట్‌ను ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగరేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వాయుసేన గౌరవ వందనం, జాతీయ పతాకం మరియు ‘ఆపరేషన్ సిందూర్’ పతాకంతో జరిగే వైమానిక ప్రత్యేక ఆకర్షణ జరగనుంది.
ప్రధాని ఎర్రకోటకు వచ్చిన వెంటనే ప్రధాన మంత్రిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ స్వాగతిస్తారు. పుష్పవర్షం అనంతరం ప్రధాన మంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత, ఎన్సీసీ (NCC) మరియు ‘మై భారత్’ వాలంటీర్లు జాతీయ గీతాన్ని పాడతారు. మొత్తం 2,500 మంది అబ్బాయి & అమ్మాయి కేడెట్లు (సైన్యం, నౌకాదళం, వాయుసేన) మరియు ‘మై భారత్’ వాలంటీర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

