ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కసారి అలా కన్నుకొట్టి అల్ ఇండియా లో వన్ నైట్ స్టార్ అయిపోయిన సంగతి మనకి తెలిసిందే. దానిపై ముస్లిం లు తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేస్ పెట్టడం, సినిమా ప్రచారం ఆగిపోవడం, ఇవన్నీ వరసగా జరిగిపోయాయి. దాదాపు నాలుగు నెలల పాటు విచారణ జరిగిన ఈ కేసు పై చివరికి సుప్రీం కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది.
ఒమర్ లులు దర్శకత్వం వహించిన “ఒరు ఆదార్ లవ్ ” చిత్రం లోని ‘మాణిక్య మలరయ’ అనే పాటలో ప్రియా వారియర్ అబ్దుల్ రహూఫ్ కి కన్ను కొట్టడం పై ముస్లింలు, ఆ పాట యొక్క నేపథ్య సంగీతం ముస్లిమ్ ల సంస్కృతికి చెందినదని, అందులో ప్రియా ఇలా కన్నుకొట్టడం తమ మనోభావాలను దెబ్బతీసేదిలా ఉందని ఆగ్రహించి సినిమా పై కేసు వేశారు.
నాలుగు నెలల తర్వాత సర్వోత్తమ న్యాయస్థానం ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అంతే కాదు “ఎవరో ఏదో పాటపాడితే మీకు కేసు వేయడం తప్ప వేరే పనేం లేదా” అని ఆగ్రహం వ్యక్తం చేసారు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. ఇక “ఒరు ఆదార్ లవ్” సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు కాబట్టి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని ప్రియా వారియర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.