ప్రధానమంత్రిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఉందా?

206
You cannot touch KCR
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల ఓ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకవచనంతో సంబోధిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడారని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసీఆర్ స్పందించారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాను ఈ రోజు ‘ప్రధాని గారిని’ అని అన్నానని అంతేగానీ, అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

తాను ప్రధానిని కించపర్చానని బీజేపీ నేతలు అనుకుంటే అలాగే అనుకోనీ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ కి జైలుకి పోవాలని ఉందా?’ అని బీజేపీ నేతలు అంటున్నారని, ‘మాట్లాడిన వారందరినీ జైలుకి పంపిస్తారా?’ అని కేసీఆర్ నిలదీశారు. తాను తన వద్ద ఉన్న ఆస్తులన్నింటిపై ఐటీ దాఖలు చేస్తున్నానని, అక్రమ సంపాదనకు పాల్పడే వారే భయపడతారని, తాను కాదని అన్నారు.

You cannot touch KCR

టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రాల పరిదిలో రిజర్వేషన్‌ ఇస్తున్న కాబట్టి కేంద్ర పరిధిలో ఉండొద్దు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై పోరాడాలని నిర్ణయించాం. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. బయ్యరా ఉక్కు ఫ్యాక్టరీ,ఎయిమ్స్‌, ఐఐఎం, కోచ్‌ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వాని నిలదీస్తాం అని సీఎం కేసీఆర్‌ మండిపడ్డాడు, నేను ప్రధాని మోదీని తిట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ప్రజాస్వామ్య పద్దతుల్లోనే మా పార్టీ పని చేస్తుంది. నావైఖరిలో ఎలాంటి మార్పులేదు. నామాటలకు కట్టుబడి ఉన్నా అని సీఎం అన్నారు. నేను ప్రధానిమంత్రి అని మాత్రమే సంబోధించాను. ఏపీ రాజకీయాలకు సంబంధించి మాత్రమే వాడువీడు అనిమాట్లాడా. అసంబద్ధమైన మాటలు మాట్లాడడం సరికాదని హెచ్చరిస్తున్నా.. ప్రజలకు ప్రత్యక్ష ఉపయోగ స్కీములు ఉంటాయి. ఎవరి కోసం నా భాషను మార్చుకోను అని అన్నారు సీఎం కేసీఆర్‌. బీజేపి నాయకులు ఓళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని తెలిపారు

- Advertisement -