కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం-కేసీఆర్‌

214
KCR to take a plunge into National politics
- Advertisement -

ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి పార్లమెంట్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో పొందుపర్చిన అనేక అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని అంశాల అమలుపై చాలా సందర్భాల్లో అప్లికేషన్లు ఇచ్చినం. దరఖాస్తులు ఇచ్చినం. పార్లమెంటరీ పార్టీ సభ్యలు, రాష్ట్ర మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. కాని ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. అందులో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయం ప్రధాని గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది.

k-1492086830

70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ రిజర్వేషన్లు కేంద్రం దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు. శాసన సభలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి పంపించాం. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు ఇచ్చే రిజర్వేషన్లను మా రాష్ర్టాల పరిధిలో ఇస్తున్నం కాబట్టి కేంద్రం నుంచి అడుగుతలేం కాబట్టి అది మీదగ్గర పెట్టుకోకండి అని చెప్పాం. దాని మీద స్పందన లేదు. లేకపోగా.. సేమ్ అదే పాత పద్ధతిని కొనసాగిస్తామని కేంద్రం చెబుతున్నది. ఈ విషయంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తం. రిజర్వేషన్ల గురించి సుప్రీం కోర్టు చెప్పినట్లుగా రాజ్యాంగ సవరణ చేయొచ్చు. పెద్ద కష్టమేమి కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండే అది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరణ చేయొచ్చు. బిల్లు కూడా పాస్ అవుతుంది. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ల గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలని కూర్చుంటున్నది. అని సీఎం అన్నారు.

ఎంజీఎన్ఆర్ఈజీఏ(మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)ని కూడా వ్యవసాయానికి అనుబంధంగా చేయాలి. దీనిపై కూడా మా ఎంపీలు పోరాటం చేస్తారు. ఇవి కాకుండా తెలంగాణకు ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎమ్.. ఇలా అనేక విషయాల మీద కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తం. ఆ దిశగా పార్లమెంట్ సమావేశాల ద్వారా తెలియజేయాలని పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. అని సీఎం తెలిపారు.

- Advertisement -