నా ముక్కును కత్తిరించొద్దు -దీపికా

492
You can take my feet, I like my nose: Deepika Padukone jokes about ...
- Advertisement -

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పద్మావత్. జనవరి 25న విడుదలైన ఈ సినిమాపై కర్ణిసేన తీవ్రంగా వ్యతిరేకించిన, నిరసనలు వ్య్తక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా..ఈ సినిమాను ప్రదర్శనను అడ్డుకునేందుకు ఎంతో ప్రయత్నించిన రాజ్ పుత్ కర్ణిసేన చివరకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హరోయిన్ దీపిక పదుకొనే ముక్కు, తల నరికి తెచ్చిన వారికి భారీ నజరానాలను కూడా నిరసనకారులు ప్రకటించారు. అయితే ఈ బెదిరింపులపై తాజాగా దీపికపదుకొనే స్పందించింది.

You can take my feet, I like my nose: Deepika Padukone jokes about ...

‘పద్మావత్’లో నటించినందుకు తన తల, ముక్కు నరికి తీసుకురావాలనే బెదిరింపులు వస్తున్నాయని దీపిక చెప్పింది. ‘దయచేసి నా ముక్కును మాత్రం కత్తిరించొద్దు’ అని ఆమె అంది. తన ముక్కు అంటే తనకు చాలా ఇష్టమని, కావాలంటే పొడవుగా ఉన్న తన కాళ్లను నరికేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి బెదిరింపులను దైర్యంగా ఎదుర్కోవడానికి తాను భయపడనని కూడా చెప్పుకొచ్చింది దీపికా.

- Advertisement -