యూ ఆర్ మై స్టార్: నటాషా

49
natasha
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్ధాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ప్రతీకారాన్ని తీర్చుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా. ఈ నేపథ్యంలోనే ఐసీసీ పోస్టు చేసిన ఓ ఫోటోను ట్యాగ్ చేసిన హార్థిక్ భార్య న‌టాషా.. యూ ఆర్ మై స్టార్ అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను, విన్నింగ్స్ మూమెంట్స్‌ను కూడా న‌టాషా షేర్ చేసింది. ఓ ఫోటోకు గ‌ర్వంగా ఉన్న‌ట్లు కామెంట్ చేసింది. ఆఖ‌ర్లో హార్దిక్ కొట్టిన విన్నింగ్ సిక్స‌ర్ వీడియోను త‌న స్టేట‌స్‌లో పెట్టుకుంది.

బ్యాటింగ్ , బౌలింగ్‌ రాణించారు హార్థిక్. 4 ఓవ‌ర్ల‌లో 25 ర‌న్స్ ఇచ్చి కీల‌క‌మైన మూడు వికెట్లను తీసుకున్న హార్ధిక్… 17 బంతుల్లో 33 ర‌న్స్ చేసి ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

- Advertisement -