మోదీగారు నా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పండిః రాహుల్ గాంధీ

234
You accepted Kohli's challenge, accept mine on reducing fuel price now: Rahul Gandhi to PM Modi
- Advertisement -

కేంద్రమంత్రి రాజవర్ధన్ సింగ్ విసిరిన సవాల్ ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరూ సవాల్ ను స్వీకరిస్తున్నారు. కేంద్రమంత్రి రాజవర్ధన్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తూ క్రికెటర్ కోహ్లి త‌న ట్వీట్ట‌ర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కోహ్లి వేసిన స‌వాల్ ను స్వీక‌రిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోదీ ఓ ట్విట్ చేశారు. త్వ‌ర‌లోనే ఓక వీడియో పోస్ట్ చేస్తాన‌ని తెలిపారు. ఇప్పుడు ఇదే ట్వీట్ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపికి్ గా మారింది.

You accepted Kohli's challenge, accept mine on reducing fuel price now: Rahul Gandhi to PM Modi

ప్ర‌ధాని మోడీ కోహ్లి పై చేసిన పోస్టుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈసంద‌ర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్ట‌ర్ లో ప్ర‌ధాని మోడీని ఓ ప్ర‌శ్న అడిగారు. కోహ్లి ఛాలెంజ్ ను మీరు స్వీక‌రించ‌డం చాలా సంతోషంగా ఉందని…మ‌రి త‌న స‌వాల్ ను కూడా స్వీక‌రించాల‌ని ట్వీట్ చేశారు. పెరిగిన పెట్రోల్, డిజిల్ ధ‌ర‌ల‌ను కేంద్రం వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేపడుతామ‌ని ట్వీట్ చేశారు.

మీ స‌మాధానం కోసం మేము ఎదురుచూస్తామ‌ని త్వ‌ర‌లోనే ప‌రిష్కారం మార్గం చేప‌ట్టాల‌ని తెలిపారు. ఇక ఇదే అంశంపై ఆర్డేడి అధినేత తేజ‌స్వీ కూడా ప్ర‌ధానికి ట్వీట్ట‌ర్ లో స‌వాల్ విసిరారు. నిరుద్యోగుల‌కు కేంద్రం ప్ర‌భుత్వం ఉద్యోగాలు క‌ల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర‌మంత్రి చేసిన ట్వీట్ కు దేశం మొత్తం ఒక‌రి నుంచి మ‌రోక‌రు ట్వీట్టర్లో స‌వాళ్లు విసురుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మోడీకి విసిరిన స‌వాల్ కు ఆయ‌న ఏవిధంగా స్పందింస్తారో వేచిచూడాలి.

- Advertisement -