గుడ్డును పోషకాల గనిగా అభివర్ణిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు పుష్కలంగా అందుతాయని చెబుతుంటారు. ఐతే గుడ్డు తినడంలో చాలా అపోహలు ఉన్నాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పచ్చసోనా తినరాదని, దానిని తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కొందరు భావిస్తుంటారు. ముఖ్యంగా పచ్చసోనాలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటుందని అందువల్ల శరీరంలో వ్యర్తమైన కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉందనేది కొందరిలో ఉండే అపోహా. అలాగే పచ్చసోనా తినడం వల్ల పైల్స్ కు దారి తీస్తుందని కూడా కొందరు భయపడుతుంటారు..
అయితే నిజానికి పచ్చసోనా తినడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చ సోనా లో అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెండుగా ఉంటాయట. ఇంకా విటమిన్ ఏ, డి, కె, బి కాంప్లెక్స్ వంటివి కూడా అధికం అని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా కండరాల పెరుగుదలకు ఎంతో ఉపయోగ పడతాయట. అయితే ఫ్పచ్చ సోనాలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువే అయినప్పటికి, శరీరానికి హాని చేసే విధంగా ఉండదని అద్యయానాలు చెబుతున్నాయి.
ఇంకా గుడ్డులోని పచ్చసొనలో కొలిన్ అనే ముఖ్యమైన మూలకం ఉంటుంది. ఇది మెదడును ఉత్తజపరుస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో ఈ పచ్చసొన మహిళలకు ఎంతో ప్రయోజనాకారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుడ్డును వేర్వేరుగా కాకుండా తెల్లసొన మరియు పచ్చసోనా కలిపి తిన్నప్పుడే అందులోని పోషకాలు శరీరానికి సమృద్దిగా అందుతాయనేది నిపుణులు చెబుతున్నా మాట. అయితే పచ్చసోనలో ఉండే పోషకాల కారణంగా మితంగా తినడం ఎంతో మంచిది. కానీ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ శాతం పెరగడం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే