ఉర్రూతలూగించడంలో మహా దిట్ట.. ఆదిత్యనాథ్‌

252
Yogi Adityanath takes oath as UP Cm...
- Advertisement -

ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వేదికపై ఉన్న యూపీ గవర్నర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో కరచాలనం చేయడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం, ఉపముఖ్యమంత్రిగా కేశవ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. కాన్షీరాం స్మృతి ఉప్‌వన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎస్సీ అధినేత ములాయం సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఆయా రాష్ర్టాల బీజేపీ ముఖ్యమంత్రులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Yogi Adityanath is BJP's CM-designate for Uttar Pradesh

యోగి ఆదిత్యనాథ్‌… వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. దూకుడుకు మారుపేరు. లవ్‌ జిహాదీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, మత మార్పిడిలపై విరుచుకుపడుతూ చెప్పిన మాటలు అగ్గిబరాటాలే. అలాంటి ఎంపీని భాజపా అధిష్ఠానం ఏరికోరి ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. ఆయన అసలు పేరు అజయ్‌సింగ్‌. అజయ్‌ భిస్త్‌ అని కూడా పిలుస్తారు. తూర్పు ప్రాంత స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన గోరఖ్‌నాథ్‌ ఆలయ ప్రస్తుత అధిపతి ఆయన. సన్యాసం తీసుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్‌గా మారారు. బీఎస్సీ చదివారు. తన ప్రసంగాలతో ప్రజల్ని ఉర్రూతలూగించడంలో మహా దిట్ట. వాటిలో ఉద్రేకపూరిత మాటలు తక్కువేం కాదు.

adityanath_650_081314052000

హిందుత్వకు సంబంధించినవే కాకుండా పేదలతో ముడిపడిన అనేకాంశాలను పార్లమెంటులో లేవనెత్తుతూవచ్చారు. మాట్లాడడానికి పార్లమెంటులో ఆయన నిల్చొన్నప్పుడల్లా రగడే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ నుంచి అయిదుసార్లు ఎన్నికైన ఎంపీగానే కాకుండా ఆ విధంగానూ ఆయనకు పేరొచ్చింది. ఆ మాటలే ఆయనకు యూపీ వెలుపలా తగినంత ప్రచారాన్ని తీసుకువచ్చాయని చెప్పడం అతిశయోక్తి కాదు. తూర్పు యూపీలోని గోరఖ్‌పూర్ తదితర జిల్లాల్లో ఆయన ప్రభావం ఎక్కువ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తరువాత ఎక్కువగా ప్రచారం చేసిన నాయకుడు ఆదిత్యనాథే.

yogi-7591

-యోగి ఆదిత్యనాథ్‌పై వివిధ క్రిమినల్ కేసులున్నాయి. అల్లర్లు, హత్యాయత్నాలు, మారణాయుధాలు కలిగి ఉండడం, ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన కేసుల్లో నిందితుడు.
-2005లో క్రిస్టియన్ మతంలోకి వెళ్లిన వేల మంది హిందువులకు శుద్ధి చేసి మళ్లీ హిందూమతంలోకి తెచ్చి వార్తల్లో నిలిచారు.
-యోగి వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతీతి. సూర్య నమస్కారాలను వ్యతిరేకించేవారు దేశంలో ఉండరాదని 2015లో హెచ్చరించారు.
-బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఒకలాంటి వారేనంటూ షారుఖ్ పాకిస్థాన్‌కు వెళ్లాలని ఒక సందర్భంలో డిమాండ్ చేశారు.

- Advertisement -