దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల భవితవ్యం కొన్ని గంటల్లో తేలిపోనున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ యూపీలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోండగా పంజాబ్లో ఆప్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.
ఉత్తరాఖండ్ మినహా(పుష్కర్‌ధామీ వెనకంజ).. దాదాపు అన్నిచోట్ల సీఎం అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గోరఖ్‌పూర్ అర్భన్‌లో యూపీ సీఎం యోగి ముందంజలో ఉండగా,కర్హల్‌లో అఖిలేష్ ,పంజాబ్ సీఎం చన్నీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాడు. గోవాలోనూ సీఎం అభ్యర్థి ప్రమోద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక అమేథీలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ ముందంజలో ఉండగా, హత్రాస్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ యూపీ డిప్యూటీ సీఎం మౌర్య, పాటియాలలో అమరీందర్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు.