త్వరలో యోగా సూపర్ లీగ్: చంద్రబాబు

8
- Advertisement -

సెప్టెంబర్ లో యోగా సూపర్ లీగ్ నిర్వహిస్తామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగాంధ్ర 2025లో భాగంగా మాట్లాడిన చంద్రబాబు.. భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తమైంది అన్నారు. 177 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారు అన్నారు.

2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్‌రోల్‌ చేసుకున్నారు… గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్‌ సృష్టించారు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేయాలి అని… చరిత్ర సృష్టించాలన్న, రికార్డులు బ్రేక్ చేయాలన్న నరేంద్ర మోదీకే సాధ్యం అన్నారు.

అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనన్నారు ప్రధాని మోదీ. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని యోగా మార్చేసింది… యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదు అన్నారు. 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి… యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది అన్నారు.

Also Read:జంగిల్ రాజ్..మోదీ ఫైర్

- Advertisement -