ప్రముఖ ర్యాప్, హిప్ హప్ సింగర్ యోయో హానీ సింగ్ కొత్త అల్బమ్‌తో మీముందుకు వస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ర్యాప్ సింగర్స్ ఉన్న భారతదేశంలో హానీ స్టైల్ ప్రత్యేకత ఇతన్ని గొప్ప ర్యాప్ సింగర్‌గా నిలబెట్టింది. తాజాగా ఈ కొత్త ఆల్బమ్ వివరాలను బేర్ ఇట్ ఆల్ డాక్యు ఫిల్మ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆల్బమ్‌ను మోజేజ్ సింగ్ దర్శకత్వం వహించగా గున్నీత్ మోంగా మరియు ఆచీన్ జైన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రతిష్టాత్మకమైన సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ ఆల్బమ్‌ను తెరకెక్కించింది.
ఈ సందర్భంగా యోయో మాట్లాడుతూ…తన జీవితంలో జరిగిన గత విషయాలను గుర్తు చేసుకున్నారు. అందుకోసమే ఇంత లేట్ అయ్యిందని వెల్లడించారు. మంచి మ్యూజిక్ ఫ్రెండ్స్‌తో నిర్మించినట్టు తెలిపారు. తనపై అపారమైన ప్రేమ చూపించిన మ్యూజిక్ లవర్సే కారణమన్నారు. గతంలో బ్రౌన్ రాంగ్, దేసీ కాలకార్, లుంగీ డ్యాన్స్ లాంటి ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే.
Singh-ing at top of our voices because Honey Singh's latest documentary is coming soon on Netflix! ❤ pic.twitter.com/4fP45lmEla
— Netflix India (@NetflixIndia) March 15, 2023
ఇవి కూడా చదవండి…