యేవ‌మ్ టీజ‌ర్..అదిరే రెస్పాన్స్

18
- Advertisement -

మీ సినిమా ఓపెనింగ్‌కు వ‌చ్చిన నేను మ‌ళ్లీ మీ చిత్రం టీజ‌ర్ విడుదల చేయ‌డం హ్య‌పీగా వుంది. యేవమ్ చాలా మంచి టైటిల్‌. మీ ప్ర‌మోష‌న్ కంటెంట్ చూస్తుంటే చిత్రం కూడా కొత్త‌గా వుంటుంద‌ని అనిపిస్తుంది.టీజ‌ర్ చాలా ఇంప్రెసివ్‌గా వుంది. మీకు ఆల్ దిబెస్ట్ అంటూ హ‌రీశ్ శంక‌ర్ యేవ‌మ్ టీజ‌ర్‌ను లాంచ్ చేసి యేవ‌మ్ టీమ్‌ను స‌పోర్ట్ చేసి సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకున్నారు.

చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ఈ చిత్రం టీజ‌ర్‌ను శుక్ర‌వారం స్టార్ మాస్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ విడుద‌ల చేశారు. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం. మా టీజ‌ర్‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుదల చేయ‌డం ఆనందంగా వుంది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా, భ‌ర‌త్‌రాజ్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేశాం. అన్ని పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read:ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్..

- Advertisement -