రాహుల్ గాంధీ బఫూనే అని తెలిపారు ఎంపీ కవిత. సీఎం కేసీఆర్..రాహుల్‌ని బఫూన్ అనడంలో తప్పేమీ లేదన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కవిత సిల్లీగా ప్రవర్తించే వారిని బఫూన్ అనే అంటారని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్థానిక పార్టీల జాబితాలో మేమున్నామని తెలిపారు. ఒక అభ్యర్థి ప్రధాని కావడం, ఒక పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు.
ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని.. మా ఎజెండా ప్రజల కోసం పనిచేయడమేనని తెలిపారు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయని వాటిలో కొన్ని విజయం సాధించాయని చెప్పారు.
జాతీయస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఉండబోతోందన్నారు. నాలుగు రాష్ర్టాలలో కాంగ్రెస్ భారీ విజయాలేమీ సాధించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,బీజేపీయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని…. ఎన్డీఏ కూటమికి టీఆర్ఎస్ టీమ్-బి గా లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం వచ్చిందని తెలిపారు కవిత.
Addressing the Press conference at Telangana Bhavan NewDelhi along with @TRSpartyonline MPs. pic.twitter.com/mdD7yYLARh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 19, 2018