మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో, యెమెన్‌కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటు దళాలు యుద్ధ రంగంలోకి దిగినట్లు ప్రకటించాయి. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతపై కొత్త ఆందోళనలు రేకెత్తిస్తోంది.
హౌతీ ఉద్యమం కు చెందిన దళాలు ఇజ్రాయెల్ లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడి యుద్ధ పరిస్థితులను మరింత వేడెక్కించేలా చేసింది.హౌతీ రెబల్స్ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ఈ దాడిని అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులకు నిరసనగా, అలాగే ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో హౌతీలు నేరుగా రంగంలోకి దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఇది యుద్ధాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా నియంత్రణలోకి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజం పిలుపునిస్తోంది.హౌతీల దాడులు ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. ఇరాన్‌కు మద్దతుగా ఈ చర్యలు చేపట్టడం ద్వారా మధ్యప్రాచ్యంలోని శక్తి సమీకరణాలు మరింత మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అత్యంత సున్నితంగా ఉండటంతో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారు.
Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

