బీజేపీ గెలవడానికి మోడీ వేవ్‌ సరిపోదు:యెడ్డీ

111
yediyurappa
- Advertisement -

పలు రాష్ట్రాల ఎన్నికలు,ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంపై ఉన్న ధీమా సడలిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా పలురాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తుండగా తాజాగా కర్ణాటాక మాజీ సీఎం యెడీయూరప్ప సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు.

క‌ర్ణాట‌కలో హ‌నేగ‌ల్‌, సింద‌గీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండగా సీఎంగా యెడీయూరప్ప తప్పుకున్న తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ నేపథ్యంలో యెడ్డీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ విజ‌యం సాధించాలంటే మోడీ వేవ్ ఒక్క‌టే స‌రిపోద‌ని, రాష్ట్రంలో అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని సూచించారు.

రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధిని బ‌ట్టే ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు ఉంటాయ‌ని …మోడీ వేవ్‌తో పాటు రాష్ట్రంలో బీజేపీ విజ‌యం సాధించాలంటే అభివృద్ది ప‌నులు త‌ప్ప‌నిస‌రి అన్నారు. అభివృద్ది ఒక్క‌టే మంత్ర‌మ‌ని..ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల‌గాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

- Advertisement -