కర్ణాటకలో రోజురోజుకు రాజకీయసమీకరణాలు మారుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 4గంటలకు అసెంబ్లీలో కర్ణాటక భవితత్వం తేలనుంది. కర్ణాటక సీఎం గా బీజేపీ ఎమ్మెల్యే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బల పరిక్షలో తుది నిర్ణయం వచ్చే వరకూ సభ్యులకు ఎటువంటి పదవులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సీఎం యడ్యూరప్ప తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.తనతో పాటు ఎమ్మెల్యే శ్రీరాములు కూడా తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు . వీరిద్దరి రాజీనామా లేఖలను లోక్ సభ స్పీకర్ ఆమోదించడం కూడా జరిగింది.
యడ్యూరప్ప అసెంబ్లీ, పార్లమెంట్ రెండు స్ధానాల నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యే గా గెలవడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే శ్రీరాములు కూడా రెండు స్ధానాలకు పోటీ చేయడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. యడ్యూరప్ప షిమోగ లోక్ సభ స్ధానం నుంచి..శ్రీరాములు బళ్లారి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సాయంత్రం జరిగే బల పరీక్షకు కర్ణాటక అసెంబ్లీ అన్ని ఏర్పాట్లు సిద్దం చేసింది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు సీఎం యడ్యూరప్ప. తమ ప్రభుత్వం బలపరిక్షలో తప్పకుండా నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు యడ్యూరప్ప.