ఈ మద్యకాలంలో ఏపీ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ చుట్టూ ఈ రాజకీయ వేడి కొనసాగుతోంది. పార్టీలో అసమ్మతి సెగలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు బావుటా, ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకత ఇలా అన్నీ వైపులా నుంచి ఫ్యాన్ పార్టీకి వ్యతిరేక గాలి విస్తోంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఊహించని విధంగా బలం కోల్పోయింది. ఇదే టైమ్ టిడిపి మూడు స్థానాలను కైవసం చేసుకొని వైసీపీకి జలక్ ఇచ్చింది. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనుకోని పరాభవం ఏదుర్కొంది వైసీపీ పార్టీ. ఎన్నికల బరిలో నిలిచిన ఏడుగురిని సునాయసంగా గెలిపించుకోవచ్చని భావించిన జగన్ కు సొంత ఎమ్మెల్యేలు గట్టి దెబ్బ తీశారు.
వైఎస్ జగన్ పై అసంతృప్తిగా ఉన్న నలుగురు వైసీపీ ఎమ్మేల్యేలు వారి యొక్క ఓటును టీడీపీకి వేయడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందారు. అధిక సంఖ్యాల్లో ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీకి ఇది ఏమాత్రం మింగుడు పడని విషయమనే చెప్పాలి. దీంతో వైసీపీకి జలక్ ఇచ్చిన నలుగురు ఎమ్మెల్యేలపై పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆ నలుగురు ఎమ్మేల్యేలు ఎవరణగా ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి.
ఈ నలుగురు కూడా గత కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు బహిరంగంగానే జగన్ పై అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఈ ఇద్దరు కూడా నియోజిక వర్గ బాద్యతల వ విషయంలో జగన్ నిర్ణయాలపై అసంతృప్తి గా ఉన్నట్లు వినికిడి. దాంతో ఈ నలుగురు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారియొక్క ఓటును టీడీపీకి వినియోగించుకున్నాట్లు తెలుస్తోంది. ఈ నలుగురు కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి…