వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజకు ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అటు రాజకీయాల్లో ఇటు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెల్లెలుగా ఒకరు.. కూతురిగా మరొకరు.. ఇద్దరు సీఎంలు నన్ను ఎంతో ఆప్యాయంగా చుసుకుంటారు. అందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని రోజా అన్నారు.
రోజా మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ తనను సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం విషయంలో ఆయనకు గౌరవం ఎక్కడా తగ్గకూడదని భావించాను అన్నారు రోజా. ఓ సీఎంగా కాకుండా.. ఓ కుటుంబ సభ్యుడిలా కలిసిపోయి మాట్లాడారన్నారు. కేసీఆర్ సరాదాగా తమతో కలిసి భోజనం చేశారని.. తనకు చాలా ఆనందగా అనిపించిందని గుర్తు చేసుకున్నారు.
ఇక వైసీపీ ఎమ్మెల్యేగా ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రెండు బాధ్యతలు నిర్వహించడం గొప్పగా ఉందుంటున్నారు రోజా. మంత్రి పదవి కన్నా గౌరవమైన పదవి తనకు దక్కిందని భావిస్తున్నానని చెప్పారు. అటు నగరి నియోజకవర్గంలో ప్రజలతో.. ఇటు ఏపీఐఐసీ ఛైర్మన్ బాధ్యలతో బిజీగా ఉన్నానంటున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. భవిష్యత్‌లో మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
MLA Roja Comments on Telangana CM KCR and AP CM YS Jagan..