కాంగ్రెస్.. వైసీపీని కూల్చబోతోందా?

20
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2014 తర్వాత పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల రాకతో తిరిగి రేస్ లో నిలిచింది. దీంతో ఏపీ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ గా నడిచిన రాజకీయాలు.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ మారిపోవడం ఆసక్తిని పెంచుతున్న అంశం. 2014 కంటే ముందు ఏపీలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో ఆ పార్టీలోని చాలామంది నేతలు వైసీపీ గూటికి చేరారు.

మళ్లీ ఇన్నాళ్లకు ఏపీలో కాంగ్రెస్ బలం పెంచుకునే పరిస్థితిలు కనబడుతుండడంతో పూర్వ వైభవం పొందేందుకు హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ టార్గెట్ గా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేస్తున్న విమర్శలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఒకవైపు జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ఆ పార్టీలోని నేతలను కాంగ్రెస్ వైపు లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. వైసీపీలో అసంతృప్త నేతలు పెరుగుతుండడంతో వారందరికి కాంగ్రెస్ వెల్కమ్ చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ వీడి వైసీపీలో చేరిన సొంత నేతలను కూడా తిరిగి పార్టీలో చేర్చుకునే విధంగా వ్యూహాలు మొదలుపెట్టిందట హస్తం హైకామాండ్. కాంగ్రెస్ వ్యూహాలను ప్రతిబింబించే విధంగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ మరింత పొలిటికల్ హీట్ ను పెంచుతుంది.

జగన్ పార్టీలో కేవలం ముగ్గురు లోక్ సభ ఎంపీలే మిగులుతారని ట్విట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను 22 సీట్లను వైసీపీ నే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేవలం ముగ్గురు ఎంపీలే వైసీపీలో మిగులుతారని మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యానించడంతో మిగతా వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు షర్మిల తో టచ్ లో ఉన్నారని తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే వైసీపీని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి 2014లో కాంగ్రెస్ ను కాళీ చేసిన వైసీపీపై హస్తం పార్టీ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి.

Also Read:Nirmala:అవినీతిని గణనీయంగా తగ్గించాం

- Advertisement -