- Advertisement -
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో నాలుగైదు రోజుల్లో మంత్రి మండలిని విస్తరించాలని భావిస్తున్నారు. అయితే ఇందులో అన్ని వర్గాలకూ,అన్ని జిల్లాలకు సమానమైన ప్రాతినిథ్యం కల్పించేలా నూతన మంత్రులను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇక ఈ నెల 7న జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి 151 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అనంతరం మరుసటి రోజు జగన్ తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేస్తారని విశ్వసనీయవర్గాల సమాచారం.
- Advertisement -