‘యాత్ర’ టీజర్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌..

219
YSR biopic

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌కి ఆనందో బ్రహ్మా డైరెక్టర్ మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముటి నటిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ తో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. రాజశేఖర్ రెడ్డి యాత్ర సమయంలో ఎదుర్కొన్న పరిస్థుతులను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.

YSR biopic

అయితే ఈ సినిమా టీజర్ ఎపుడెప్పుడాని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమౌతున్నారు చిత్ర యూనిట్. ఇక ఆ రోజున రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వలన ఈ నిర్ణయం తీసుకున్నారట సమాచారం. ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలను జగపతిబాబు సుహాసిని, రావు రమేశ్, అనసూయ పోషిస్తున్నారు.