హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా

51
yashwanth
- Advertisement -

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ కు చేరుకుంటారు.

జలవిహార్ లో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్ సిన్హా కోరనున్నారు.

యశ్వంత్ సిన్హా టూర్ షెడ్యూల్ ఇదే…..

() ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాయ్‌పూర్ నుండి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బయలుదేరుతారు.
() ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
() విమానాశ్రయం వద్ద సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతారు.
() ఎయిర్ పోర్టు నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీగా జలవిహార్‌ కు చేరుకుంటారు.
() మధ్యాహ్నం 12 గంటలకు జలవిహార్ లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు.
() మధ్యాహ్నం 1.00 గంటలకు సీఎం కేసీఆర్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.
() మధ్యాహ్నం 3.30 గంటలకు హోటల్ ఐటీసీ కాకతీయలో ఏఐఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు.
() సాయంత్రం 4.15 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
() సాయంత్రం 4.45 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయ్యి.. 5.45 గంటలకు బెంగళూరు చేరుకుంటారు.

- Advertisement -