1983 క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆడిన యశ్ పాల్ ఇక లేరు. ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించగా పలువురు క్రికెటర్లు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. యశ్‌పాల్ మృతి బాధాకరం…83 వరల్డ్ కప్‌లో అతని ప్రదర్శన అసాధారణమన్నారు. యశ్‌పాల్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యశ్‌పాల్ మృతి ఎంతో షాక్‌కు గురి చేసిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1983 వరల్డ్‌కప్‌లో అతని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడినని…భారతీయ క్రికెట్‌కు ఆయన అందించిన భాగస్వామ్యం మరవలేనిదన్నారు. వరల్డ్ కప్ విన్నింగ్ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ . అంపైర్‌గా, సెలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు మరిచిపోలేమని మంత్రి తన ట్వీట్‌లో తెలిపారు.
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్.. ఇంకా అనేక మంది క్రికెటర్లు యశ్‌పాల్ మృతి పట్ల నివాళి అర్పించారు.